లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం

  • జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఘటన
  • రంగంలోకి ఎస్డీఆర్ఎఫ్, సివిల్ క్విక్ రెస్పాన్స్ టీం, పోలీసులు
  • కొనసాగుతున్న సహాయక చర్యలు
జమ్మూకశ్మీర్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు లోయలోకి జారిపడడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 

సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, సివిల్ క్విక్ రెస్పాన్స్ టీం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కారులోంచి మృతదేహాలను వెలికి తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.  ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణంపై ఆరా తీస్తున్నారు.

Road Accident
Jammu And Kashmir
Srinagar

More Telugu News